టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్ బాబు కొత్త చిత్రం సర్కారువారిపాట. పరశురామ్ డైరెక్షన్లో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో కీర్తి సురేష్ కధానాయిక. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మే 12న విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన కళావతి, పెన్నీ, టైటిల్ సాంగ్, మ మ మ మహేష్ లిరికల్ సాంగ్స్ శ్రోతలను ఒక రేంజులో ఆకట్టుకున్నాయి. అయితే ఈ మూవీ నుండి చివరిగా విడుదలైన మ మ మ మహేష్ పాట స్థానంలో వేరొక పాట ఉండేదని ఇటీవలనే తెలిసింది.
సితార పాప డాన్సులతో ఆకట్టుకున్న పెన్నీ సాంగ్ థియేట్రికల్ ఎడిషన్ లో ఉండదని మహేష్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసారు. మరి మ మ మ మహేష్ పాట స్థానంలో అంతకుముందు ఉన్న పాట సంగతేంటి? జానపద నేపథ్యంలో సాగే మురారి బావ పాటది. ఈ పాట విషయంపై తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. SVP విడుదలైన ఒక వారానికి మురారి బావ పాటను యూట్యూబులో రిలీజ్ చేస్తామని మహేష్ తెలిపారు. దీంతో ప్రేక్షకుల్లో ఈ సినిమా పట్ల మరింత బజ్ క్రియేట్ అవుతుందని మహేష్ అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa