'మన్మధుడు', 'మురారి', 'ఇంద్ర' వంటి సినిమాలలో నటించి తన నటనతో అందరిని ఆకట్టుకున్న గ్లామర్ బ్యూటీ సోనాలి బింద్రే ఇప్పుడు సినిమాలలోకి రి-ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. క్యాన్సర్ తో బాధపడిన ఈ స్టార్ హీరోయిన్ యుఎస్‌లో చికిత్సను పొంది క్యాన్సర్‌ను జయించింది. ఇప్పుడు చాలా కాలం తర్వాత, OTT షోతో మళ్లీ రి-ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ZEE5 ఒరిజినల్ డ్రామా సిరీస్ 'ది బ్రోకెన్ న్యూస్' తో సోనాలి బింద్రే స్ట్రీమింగ్ స్పేస్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు లేటెస్ట్ టాక్. ఈ షోలో పాటల్ లోక్ స్టార్ జైదీప్ అహ్లావత్ మరియు శ్రియా పిల్గావ్‌కర్ కూడా కీలక పాత్రలలో కనిపించనున్నారు సమాచారం. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa