కోలీవుడ్ స్టార్ హీరోస్ సూర్య అండ్ కార్తీ కలిసి ఒక సినిమా చేస్తున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. అయితే ఈ స్టార్ బ్రదర్స్ ఇప్పుడు కలిసి నిజంగా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నట్లు సమాచారం. సూర్య అండ్ కార్తీ అభిమానులు ఈ వార్తతో సంబరాలు చేసుకుంటున్నారు. తాజా అప్డేట్ ప్రకారం, సూర్య-కార్తీ కలిసి కార్తీ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం 'కైతి' (తెలుగులో ఖైదీ) సీక్వెల్‌లో కలిసి నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో సూర్య ఒక ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉంది అని లేటెస్ట్ టాక్. ఈ విషయం గురించి మూవీ మేకర్స్ ఇంకా అధికారకంగా ఏమి ప్రకటించలేదు. 'కైతి' సినిమాకి డైరెక్ట్ చేసిన లోకేష్ కనగరాజ్ ఈ సీక్వెల్‌కి కూడా దర్శకత్వం వహించనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa