ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ దేవరకొండ-సమంత సినిమా గురించిన ఆసక్తికరమైన అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Fri, May 13, 2022, 02:41 PM

టాలీవుడ్ యంగ్ అండ్ సేనాషనల్ హీరో విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన గ్లామర్ బ్యూటీ సమంత రూత్ ప్రభు జంటగా కనిపించనుంది. ఈ చిత్రానికి 'ఖుషి' అనే టైటిల్‌ని లాక్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మూవీ మేకర్స్ 'VD11' సినిమా ఫస్ట్ లుక్‌ పోస్టర్ ని మే 16, 2022న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో సచిన్ ఖేడాకర్, మురళీశర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హృదయం ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa