ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగ చైతన్య సినిమాతో బిజీ అయిన మహేష్ బాబు దర్శకుడు

cinema |  Suryaa Desk  | Published : Mon, May 16, 2022, 12:21 PM

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఈ స్టార్ హీరో ఇప్పటికే వెంకట్ ప్రభు మరియు విక్రమ్ కుమార్‌లతో సినిమాలకు సైన్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. గతంలో ఈ యంగ్ హీరో, దర్శకుడు పరుశురామ్ తో ఒక ప్రాజెక్ట్ చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, చైతూ ఈ ప్రాజెక్ట్‌ను ఖరారు చేసినట్లు ఫిలిం సర్కిల్ లో లేటెస్ట్ టాక్. పరశురామ్ ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ను ఇప్పటికే లాక్ చేసినట్లు సమాచారం. అతి త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. రొమాంటిక్ కామెడీట్రాక్ లో రానున్న ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ నిర్మించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa