ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో వస్తున్న సినిమాలివే

cinema |  Suryaa Desk  | Published : Mon, May 16, 2022, 03:26 PM

ఈ వారం థియేటర్లలో కొన్ని సినిమాలు సందడి చేయనున్నాయి. మరోవైపు ఇంట్లో టీవీలు, చేతిలోని సెల్ ఫోన్లలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై మరికొన్ని సినిమాలు ఫ్యాన్స్ ను ఉర్రూత లూగించనున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు:
1.శేఖర్ : రాజశేఖర్ నటించిన ఈ సినిమా మే 20న రిలీజ్ కానుంది.
2.ధగడ్ సాంబ: సంపూర్ణేశ్ బాబు నటించిన ఈ సినిమా మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
3.ధాకడ్: కంగనా రనౌత్ నటించిన ఈ సినిమా మే 20న విడుదల కానుంది.
4.భూల్ భులయ్యా2: కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ నటించిన సినిమా 20న విడుదలవుతోంది.
ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలివే :
1.ఆర్ఆర్ఆర్: మే 20 నుంచి జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.
2.ఆచార్య: అమెజాన్ ప్రైమ్ వేదికగా మే 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
3.భళా తందనాన: డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa