పరశురామ్ డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారువారిపాట. ఈ చిత్రానికి తమన్ సంగీతమందించారు. భారీ అంచనాలతో ఈ సినిమా చూడటానికి రండి అని చిత్రబృందం చేసిన ప్రమోషన్స్ నిజంగా నిజం అయ్యాయి. ప్రేక్షకులు, అభిమానులు పెట్టుకున్న భారీ అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా నూటికి నూరు శాతం విజయం సాధించిందనే చెప్పాలి. రెండురోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమా ఓవర్సీస్ కలెక్షన్లు కూడా బాగానే ఉన్నాయి. ప్రీమియర్స్, తొలిరోజు వసూళ్ల తోనే ఒక మిలియన్ క్లబ్ లో చేరింది. ఈ సినిమాతో మహేష్ ఓవర్సీస్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ఎందుకంటే, మరే సౌత్ హీరోకు కూడా లేనటువంటి 11 మిలియన్ డాలర్ల సినిమాలు మహేష్ ఖాతాలోనే ఉన్నాయి. ఈ మూవీ సక్సెస్ సెలెబ్రేషన్స్ ను కర్నూలు లో చాలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పరశురామ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నిర్మాతలు, తదితర చిత్రబృందం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్ మాట్లాడుతూ... ఒక్కడు సినిమా తర్వాత మళ్ళీ ఇప్పుడే కర్నూలు రావటం జరిగింది. ఇంతమంది అభిమానులను ఒకేచోట చూస్తుంటే, ఒక 100 రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు అనిపిస్తుంది. రాయలసీమ అంటే వేడుకలకు నిలయం అన్నట్టు ఈ మూవీ సక్సెస్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ సక్సెస్ చేసినందుకు, ప్రేక్షకాభిమానులకు కృతజ్ఞతలు. ప్రేక్షకుల అత్యుత్సాహం వల్లనో, లేక కర్నూలు నన్నేదో మాయ చేసిందో తెలీదు కానీ, కెరీర్ లో మొదటిసారి స్టేజిపై డాన్స్ వేసాను. కుటుంబంతో కలిసి ఈ సినిమాను ఇటీవలే వీక్షించాను. సితార, గౌతమ్ లకు ఈ సినిమా నా మిగిలిన సినిమాలన్నిటి కంటే బాగా నచ్చింది. నాన్న కృష్ణ గారైతే ఈ సినిమా పోకిరి, దూకుడు తర్వాత నా కెరీర్ లో నిలిచిపోయే సినిమా అవుద్దని అన్నారు.... అని మహేష్ మాట్లాడారు. ఇంకా మిగిలిన చిత్రబృందం కూడా ఈ సినిమా గురించిన ఎన్నో విషయాలను పంచుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa