ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆకట్టుకుంటున్న లేడీ సూపర్ స్టార్ 'O2' టీజర్

cinema |  Suryaa Desk  | Published : Tue, May 17, 2022, 12:58 PM

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం ఇటీవల విడుదలైన 'కాతువాకుల రెండు కాదల్' మూవీ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తుంది. కొన్ని రోజుల క్రితం, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లేడీ సూపర్ స్టార్ తదుపరి సినిమా 'O2' ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. GS విక్నేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తన ప్లాట్‌ఫారమ్‌లో డైరెక్ట్ గా విడుదల కానుంది అని ప్రకటించింది. తాజాగా ఈ థ్రిల్లర్ ప్రీమియర్ రైట్స్ ని సొంతం చేసుకున్న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్ ఆసక్తికరంగా కనిపిస్తోంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఈ సినిమాలో రిత్విక్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ OTT సినిమా తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడలో విడుదలకానుంది. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa