ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ వారం థియేటర్స్ లో విడుదల కానున్న కొత్త టైటిల్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, May 17, 2022, 01:15 PM

శేఖర్: ప్రముఖ సీనియర్ హీరో రాజశేఖర్ తన 91వ సినిమాని లలిత్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'శేఖర్' అనే టైటిల్ మూవీ మేకర్స్ ఖరారు చేసారు. ఈ సినిమా మే 20, 2022న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మలయాళ థ్రిల్లర్ జోసెఫ్ సినిమా అధికారిక రీమేక్. ఈ సినిమాలో అను సితార అండ్ ముస్కాన్ ఖుబ్‌చందానీ కథానాయికలుగా నటిస్తున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్ అండ్ పెగాసస్ సినీ కార్ప్‌పై MLV సత్యనారాయణ, శివాని, శివాత్మిక అండ్ వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ సినిమాని నిర్మిస్తున్నారు.


ధాకడ్: బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్, రజనీష్ ఘాయ్ దర్శకత్వంలో "ధాకడ్" సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఉమన్ సెంట్రిక్ యాక్షన్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో ఏజెంట్ అగ్నిగా కంగనా సాలిడ్ గా కనిపిస్తుంది. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాలో అర్జున్ రాంపాల్ మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు. మే 20న ఈ సినిమా విడుదల కానుంది.


భూల్ భూలయ్యా 2: అనీస్ బాజ్మీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ 'భూల్ భూలయ్యా 2' సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా కార్తీక్ సరసన బ్యూటీ క్వీన్ కియారా అద్వానీ జంటగా నటిస్తుంది. ఈ సినిమా భూల్ భూలయ్యా (2007)కి సీక్వెల్, ఇది చంద్రముఖికి రీమేక్. 'భూల్ భూలయ్యా 2' మే 20, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో టబు, రాజ్‌పాల్ యాదవ్ అండ్ సంజయ్ మిశ్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి-సిరీస్ అండ్ సినీ 1 స్టూడియోస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, మురాద్ ఖేతాని, అంజుమ్ ఖేతాని అండ్ క్రిషన్ కుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa