ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్టీఆర్ 30లో కనిపించే ఇద్దరు క్రేజీ భామలు

cinema |  Suryaa Desk  | Published : Thu, May 19, 2022, 11:43 AM

ఆర్ ఆర్ ఆర్ పాన్ ఇండియా గ్రాండ్ సక్సెస్ తో తారక్ తదుపరి సినిమాపై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. అదికాక జనతా గ్యారేజ్ వంటి హిట్ మూవీ అందించిన కొరటాల శివ డైరెక్షన్లో తారక్ సినిమాను చేయనుండటంతో ఆ అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. కెరీర్ పరంగా చూసుకుంటే ఎన్టీయార్ కు ఇది 30 వ సినిమా. ఆర్ ఆర్ ఆర్ తో తనకొచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ కు ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా ఈ సినిమాలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు తారక్. మే 20న తారక్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ మూవీని అధికారికంగా ప్రకటించనున్నారు.  ఈ క్రేజీ సినిమా హీరోయిన్ విషయంలో ఎన్నో రూమర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమాలో ఏ హీరోయిన్ నటిస్తోందో క్లారిటీ వచ్చింది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని ఈ సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ చేశారాని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ రోల్ కూడా ఉంటుందట. ఆ ప్లేస్ లో హీరోయిన్ సాయిప‌ల్ల‌విని తీసుకున్నారని సమాచారం. ఆచార్య ప్లాప్ తో ఎన్టీఆర్ సినిమా విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడట కొరటాల.మరి కొరటాల జాగ్రత్తలు ఈ సినిమా సక్సెస్ కు కారణమవుతాయా? లేదా? అన్నది తెలియాలంటే, చాలా కాలం వేచిఉండాలి. అయినా రేపు ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తారా? లేదా? అన్నది కూడా అనుమానమే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa