టాలీవుడు సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నారు. మే 27న ఈ చిత్రం విడుదలవబోతుంది. ఆ తర్వాత అనిల్ నటసింహం బాలకృష్ణ తో కలిసి ఒక సినిమాను చెయ్యనున్నారన్న విషయం తెలిసిందే. ఎఫ్ 3 ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో అనిల్ బాలయ్యతో చెయ్యబోయే సినిమాపై బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలోని ఒక కీలకపాత్రలో యువహీరో నవీన్ పోలిశెట్టి నటించనున్నారట. సినిమాలో నవీన్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటివరకు బాలయ్య ఎలాంటి కామెడీ సినిమాలలో కూడా కనిపించలేదు. తన సినిమాలలో కూడా బాలయ్య కామెడీ అంతగా ఉండదు. సెపరేట్ కామెడీ ట్రాక్ ఉంటుంది. బాలయ్య అభిమానులు కూడా ఆయన చేత కామెడీని చేయించొద్దని కోరుకుంటున్నారట. మరి అనిల్ ఏమో పక్కా ఎంటర్టైనింగ్ తరహా దర్శకుడు. మరి వీరిద్దరి కాంబోలో సినిమా ఎలా ఉండనుందని అంతటా ఆసక్తి నెలకొంది. బాలయ్య ఎలాగూ యాక్షన్ కాబట్టి.. నవీన్ చేత ఫుల్ కామెడీ చేయించాలని అనిల్ సూపర్ ప్లాన్ వేశాడట. జూలై నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని అనిల్ రావిపూడి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa