RRR: SS రాజమౌళి డైరెక్షన్ లో టాలీవుడ్ స్టార్ హీరోస్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'RRR' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ యాక్షన్ డ్రామా మూవీలో అలియా భట్, సముద్రఖని, అజయ్ దేవగన్, శ్రియా శరణ్, ఒలివియా మోరిస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. RRR సినిమా తెలుగు, తమిళం, కన్నడ అండ్ మలయాళ భాషల వెర్షన్‌ల రైట్స్ ని ZEE5 సొంతం చేసుకోగా నెట్‌ఫ్లిక్స్ హిందీ వెర్షన్‌ను రైట్స్ ని పొందింది. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామా సినిమా మే 20 నుండి నెట్‌ఫ్లిక్స్ మరియు ZEE5లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులోకి రానుంది. ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ స్థాయిలో నిర్మించారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
ఆచార్య: కొరటాల శివ దర్శకత్వంలో టాలీవుడ్ మెగా స్టార్ అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న "ఆచార్య" సినిమా గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన పూజాహెడ్గే జంటగా నటించనుంది. సోనూసూద్, తనికెళ్ల భరణి తదితరులు ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 20, 2022న విడుదల కానుంది. ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్నాయి. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించారు.
భళా తందనానా: చైతన్య దంతులూరి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు నటించిన 'భళా తందనానా' సినిమా మే 6, 2022న థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన కేథరిన్ థ్రెసా జంటగా నటిస్తుంది. కేజీఎఫ్ ఫేమ్ రామచంద్రరాజు ఈ సినిమాలో విలన్‌గా నటించారు. సత్య, శ్రీనివాస్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకోగా, స్టార్ మా శాటిలైట్ రైట్స్ ని కొనుగోలు చేసింది. తాజాగా ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఈ సినిమా మే 20, 2022న విడుదల కానుంది. వారాహి చలనచిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.
12th మ్యాన్: జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాకి '12th మ్యాన్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. డిస్నీ హాట్‌స్టార్ ఈ సినిమా OTT రైట్స్ ని సొంతం చేసుకుంది. మే 20, 2022న ఈ సినిమా డిస్నీ హాట్‌స్టార్ లో ప్రసారానికి అందుబాటులోకి రానుంది. ఉన్ని ముకుందన్, అనుశ్రీ, అను సితార ఈ మిస్టరీ థ్రిల్లర్‌లో కీలక పాత్రలలో కనిపించనున్నారు. అనిల్ జాన్సన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్ నిర్మించింది.
పంచాయత్ 2: నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్ మరియు జితేంద్ర కుమార్ నటించిన పంచాయత్ సీజన్ 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ కామెడీ-డ్రామా సిరీస్ మే 20 నుండి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది.
జెర్సీ: గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ నటించిన 'జెర్సీ' సినిమా ఏప్రిల్ 22, 2022న విడుదలయింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం మే 20, 2022న నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారానికి అందుబాటులోకి రానుంది. దిల్ రాజుతో కలిసి అల్లు అరవింద్, నాగ వంశీ, బన్నీ వాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సచేత్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa