గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్నసినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు బాలకృష్ణ. రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ ఆధారంగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టబోతున్నారు బాలకృష్ణ. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఫన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇందులో బాలకృష్ణ డ్యూయల్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని సమాచారం. కాగా ఈ సినిమాలో బాలకృష్ణ కూతురిగా శ్రీలీల కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాఘవేంద్రరావు దర్శకత్వపర్యవేక్షణలో రూపొందిన పెళ్లి సందడి సినిమా ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టింది శ్రీలీల. ఈ సినిమాలో అందాల ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆమె తెలుగులో వరుసగా అవకాశాల్ని అందుకుంటోంది. ప్రజెంట్ రవితేజ, నితిన్ సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా బాలకృష్ణ సినిమా రూపంలో ఆమె బంపర్ ఆఫర్ అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సెప్టెంబర్‌లో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకురాబోతున్నట్లు ఇటీవలే అనిల్ రావిపూడి వెల్లడించారు. త్వరలో ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు అనిల్‌రావిపూడి. వెంకటేష్, వరుణ్‌తేజ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం మే 27న రిలీజ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa