హుషారు మరియు రౌడీ బాయ్స్ వంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లతో ప్రేక్షకుల గుర్తింపును సంపాదించుకున్న యువనటుడు తేజ్ కూరపాటి. ఆయన సోలో హీరోగా నటిస్తున్న చిత్రం నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా ..?. ఈ చిత్రాన్ని వెంకట్ డైరెక్ట్ చేస్తుండగా, అఖిల హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రానికి కే. సందీప్ కుమార్ సంగీతం అందించారు. రీసెంట్ గా ఈ చిత్రం నుండి "పుడమిని తడిపే" అని లిరికల్ సాంగ్ ను చిత్రబృందం రిలీజ్ చేసారు. టాలీవుడ్ యంగ్ సింగర్ రమ్య బెహరా ఈ గీతాన్ని తన మృదువైన గాత్రంతో ఎంతో మెలోడియస్ గా ఆలపించారు. GVR ఫిలిం మేకర్స్, రాజధాని ఆర్ట్ మూవీస్ సంయుక్త బ్యానర్ లపై ముల్లేటి కమలాక్షి, GVR ఈ సినిమాను నిర్మించారు.
నటుడిగా మారకముందు తేజ్ కూరపాటి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసారు. బెక్కం వేణుగోపాల్ తెరకెక్కించిన నాన్నా ..నేను..నా బాయ్ ఫ్రెండ్స్ చిత్రానికి, హరీష్ శంకర్ దువ్వాడ జగన్నాథం చిత్రానికి తేజ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa