ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ ఐన "జనగణమణ" మూవీ

cinema |  Suryaa Desk  | Published : Fri, May 27, 2022, 04:25 PM

మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం జనగణమణ. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి భాగం ఇటీవలే థియేటర్లలో విడుదలై మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కొల్లగొట్టింది. తాజాగా ఈ సినిమా ఓటిటిలో సందడి చెయ్యడానికి రంగం సిద్ధం చేసుకుంది. జూన్ 2వ తేదీ నుండి ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో, మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషలలో అందుబాటులోకి రానుంది. 


జనగణమణ సినిమాను డిజో జోస్ ఆంథోనీ డైరెక్ట్ చేసారు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో పృథ్విరాజ్ రిటైరన పోలీసాఫీసర్ గా, న్యాయవాదిగా కనిపిస్తారు. ఈ చిత్రానికి జెక్స్ బిజోయ్ సంగీతం అందించారు. ఇందులో మమ్ముట్టి, శ్రీ దివ్య, మమతా మోహన్ దాస్, సూరజ్ వెంజముద్ర తదితరులు నటించారు. సుప్రియా మీనన్, లిస్టిన్ స్టీఫెన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa