ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటెన్స్ అండ్ ఇంట్రెస్టింగ్ గా రానా 'విరాట పర్వం' టీజర్

cinema |  Suryaa Desk  | Published : Tue, May 31, 2022, 12:30 PM

వేణు ఊడుగుల దర్శకత్వంలో టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి 'విరాట పర్వం' సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ పీరియాడికల్ డ్రామాలో సాయి పల్లవి కథానాయికగా నటించింది. రానా అభిమానులు అండ్ సినీ ప్రేమికులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విరాట పర్వం సినిమా జూన్ 17, 2022న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా మూవీ మేకర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసారు. ఈ సినిమా నక్సల్ ఉద్యమం నేపథ్యంలో సాగే ప్రేమ కథలా కనిపిస్తోంది. ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, ప్రియమణి, ఈశ్వరీ రావు, రవి ఆనంద్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa