టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తమిళ హిట్ సినిమా 'వినోదయ సీతం' రీమేక్ చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడని ఫిలిం ఇండస్ట్రీ లో వార్తలు వినిపిస్తున్నాయి. సముద్రకని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి మూవీ మేకర్స్ ఇంకా టైటిల్ ని లాక్ చేయలేదు. ఈ రీమేక్‌లో పవన్ కళ్యాణ్ దేవుడిగా నటించనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా రిపోర్ట్స్ ప్రకారం, ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావచ్చని సమాచారం. పవన్ ప్రస్తుతం 'హరి హర వీర మల్లు' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు అంతేకాకుండా సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్ వంటి దర్శకులతో కూడా సినిమాలకు కమిట్ అయ్యాడు. ఈ సినిమాలని కంప్లీట్ చేసాక ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది అని సమాచారం. పవన్ క్యారెక్టరైజేషన్ ఈ చిత్రానికి ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది అని లేటెస్ట్ టాక్. పపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ZEE5తో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa