ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విడుదల తేదీని లాక్ చేసిన శివ కార్తికేయన్-అనుదీప్ ప్రాజెక్ట్

cinema |  Suryaa Desk  | Published : Tue, May 31, 2022, 12:49 PM

తమిళ హీరో శివకార్తికేయన్, జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ తో డైరెక్ట్ తెలుగు మూవీ తీస్తున్నారు అని అందరికి తెలిసిన విషయమే. తాత్కాలికంగా ఈ సినిమాకి SK20 అనే టైటిల్‌ని మేకర్స్ పెట్టారు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ LLP, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ భారీ స్థాయిలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన జోడిగా ఉక్రెయిన్ బ్యూటీ మెరీనా ర్యాబోషప్కా కనిపిస్తుందని మేకర్స్ ప్రకటించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌ట్రాక్ లో రానున్న ఈ సినిమా ఆగస్టు 31న విడుదల కానుంది అని మూవీ మేకర్స్ ప్రకటించారు. తమిళ-తెలుగు మూవీకి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మనోర్ పరమహంస కెమెరా క్రాంక్ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa