టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన గ్లామర్ బ్యూటీ సమంత రూత్ ప్రభు జంటగా కనిపించనుంది. మూవీ మేకర్స్ ఈ సినిమాకి 'ఖుషి' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ తాజాగా కశ్మీర్‌లో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లు సమాచారం. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, తాజాగా టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో నటించిన టాప్ గన్: మావెరిక్ అనే హాలీవుడ్ చిత్రాన్ని ఈ స్టార్ హీరో వీక్షించారు. హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో విజయ్ సాధారణ దుస్తులు ధరించి ఈ సినిమా చూశారు. విజయ్ దేవరకొండ 'లైగర్' సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 25, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూరి జగన్నాధ్‌తో అతని మరో సినిమా 'జన గణ మన' త్వరలో ప్రారంభం కానుంది.