"ప్రేమ యుద్ధం" మూవీ నుంచి 'స్వాతీ ముత్యపు జల్లులలో' సాంగ్ లిరిక్స్:
స్వాతీ ముత్యపు జల్లులలో
శ్రావణ మేఘపు జావళిలో
స్వాతీ ముత్యపు జల్లులలో
శ్రావణ మేఘపు జావళిలో
నిండే దోసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే
నీతో రాతిరి గడిపే లాహిరి నిన్నే కడిగెనులే
ఆ...ఆఆ...ఆఆ....ఆఆ అహా హా...ఓ ఓహోహొ
స్వాతీ ముత్యపు జల్లులలో
శ్రావణ మేఘపు జావళిలో
స్వాతీ ముత్యపు జల్లులలో
శ్రావణ మేఘపు జావళిలో
నిండే దోసిలి పండే కౌగిలి నన్నే అడిగెనులే
నీతో రాతిరి గడిపే లాహిరి నన్నే కడిగెనులే
ఆ...ఆఆ...ఆఆ....ఆఆ అహా హా...ఓ ఓహోహొ
దరువేసిందమ్మా
కబురే కసిగా తెలిపీ తడిగా ఒడినే దులిపీ
జడివానేం చేస్తుందీ జవరాలే తోడుంటే
తడిపేసిందమ్మా
తనువూ తనువూ కలిపీ తనతో సగమే చెరిపీ
చలిగాలేం చేస్తుందీ చెలికాడే తోడుంటే
ఆ మెరుపులకే మెలితిరిగే సొగసులతో
ఈ ఉరుములకే ఉలికి పడే వయసులతో
కురిసిందీ వానా తొలిగా పరువానా
స్వాతీ ముత్యపు జల్లులలో
శ్రావణ మేఘపు జావళిలో
నిండే దోసిలి పండే కౌగిలి నన్నే అడిగెనులే
నీతో రాతిరి గడిపే లాహిరి నన్నే కడిగెనులే
లా ల్లలల్లా... లా ల్లలల్లా...
మతిపోయిందమ్మా
మనసు మనసు కలిసి కథలు కళలు తెలిసీ
జలపాతం నీవైతే అల గీతం నేనే లే
కసిరేగిందమ్మా
కలతో నిజమే కలిసీ దివిని భువినీ కలిపీ
సిరి తారలు తెస్తాలే నీ విరులే చేస్తాలే
ఈ చిటపటకే శృతి కలిసే వలపులతో
ఈ తపనలకే జత కలిసే తలపులతో
కురిసిందీ వానా తొలిగా పరువానా
స్వాతీ ముత్యపు జల్లులలో
శ్రావణ మేఘపు జావళిలో
స్వాతీ ముత్యపు జల్లులలో
శ్రావణ మేఘపు జావళిలో
నిండే దోసిలి.. పండే కౌగిలి.. నిన్నే అడిగెనులే
నీతో రాతిరి గడిపే లాహిరి నన్నే కడిగెనులే
ఆ...ఆఆ...ఆఆ....ఆఆ అహా హా...ఓ ఓహోహొ