తెలుగు ప్రేక్షకులు మరియు సినీ ప్రేమికులకు ఎంఎస్ రాజు గురించి పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన కెరీర్‌లో భారీ చిత్రాలను నిర్మించాడు. తాజాగా ఇప్పుడు కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తున్నాడు. "7 డేస్ అండ్ 6 నైట్స్" అనే కొత్త సినిమాకి దర్శకుడిగా మారిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు సుమంత్ అశ్విన్ మరియు మెహర్ చావల్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం కొత్త విడుదల తేదీని పొందింది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీని జూన్ 24, 2022న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అదే విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. సుమంత్ అశ్విన్, రజనీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సమర్థ్ గొల్లపూడి సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.