భారత దేశంలోని ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్స్ లో నెట్‌ఫ్లిక్స్ ఒక్కటి. ఇటీవల విడుదలైన 'జన గణ మన' (మలయాళం) మరియు 'డాన్' (తమిళం) రెండు సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ పొందింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. 'జన గణ మన' అండ్ 'డాన్' సినిమాలు జూన్ 2 మరియు జూన్ 10, 2022న తన ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంటాయని నెట్‌ఫ్లిక్స్ ఇటీవల ప్రకటించింది. ఈ రెండు సినిమాలూ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానున్నాయి కానీ హిందీలో ప్రసారానికి అందుబాటులో ఉండదు అని వార్తలు వినిపిస్తున్నాయి. సౌత్ ఇండియన్ సినిమాలను ఇష్టపడే హిందీ ప్రేక్షకులకు ఈ విషయం కాస్త నిరాశను కలిగించింది. నెట్‌ఫ్లిక్స్ ఈ రెండు సినిమాల హిందీ-డబ్బింగ్ వెర్షన్‌ల విడుదలకు సంబంధించి ఎటువంటి అప్‌డేట్‌ను ఇప్పటివరకు వెల్లడించలేదు.