సౌత్ ఇండియా టాప్ యాక్ట్రెస్ లో సిజ్లింగ్ బ్యూటీ పూజా హెడ్గే ఒక్కరు. ఈ స్టార్ బ్యూటీ ఇటీవలే విడుదలైన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య వంటి భారీ చిత్రాలలో నటించింది. పూజా ప్రస్తుతం తెలుగు మరియు తమిళ సినిమాలతో ఫుల్ బిజీ షెడ్యూల్ లో ఉంది. తాజాగా ఇప్పుడు పూరి జగన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న 'జన గణ మన' సినిమాలో రౌడీ స్టార్ సరసన రొమాన్స్ చేయడానికి సిజ్లింగ్ బ్యూటీ పూజా హెడ్జ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రంలో విజయ్‌తో పాటు పూజా కొన్ని యాక్షన్ బ్లాక్‌లను చేయనున్నట్లు సమాచారం. అందుకోసం ఈ సిజ్లింగ్ బ్యూటీ విదేశీ కోచ్ వద్ద శిక్షణను ప్రారంభించింది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ 2023 ఆగస్టు 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.