పరశురామ్ పెట్ల దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా అన్ని చోట్ల సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఇప్పుడు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'మురారి వా' పాట ఈ సినిమాకి జోడించబడింది, థియేటర్లలో ఈ సినిమా విజయవంతంగా రన్ అవుతుంది. GMB ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. థమన్ స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.