బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ సౌత్ డైరెక్టర్ అట్లీతో ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. ఈ మూవీలో షారూఖ్ ఖాన్ సరసన జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో సన్యా మల్హోత్రా అండ్ సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి 'జవాన్' అనే టైటిల్ ని లాక్ చేసినట్లు సమాచారం. తాజాగా మూవీ మేకర్స్ అనౌన్స్‌మెంట్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో కూడా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా జూన్ 2, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో విడుదల కానుంది. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ ఈ సినిమాని నిర్మిస్తుంది.