కోలీవుడ్, బాలీవుడ్ లలో మంచి గుర్తింపు ఉన్న సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించాడు ఆర్. మాధవన్. కేవలం నటుడిగానే కాకుండా డైరెక్టర్ గా , ప్రొడ్యూసర్ గా కూడా చిత్రసీమకు తన సేవలనందించాడు.
తాజాగా ఆయన సోషల్ మీడియాలో ఇంటరెస్టింగ్ పోస్ట్ చేసారు. మాధవన్, తన భార్య సరితతో వివాహం జరిగి 23 సంవత్సరాలు గడిచిన సందర్భంగా కొన్ని క్యూట్ పిక్స్ షేర్ చేసారు. గతంలో కన్నా ఇప్పుడు నిన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాను.. వివాహవార్షికోత్సవ శుభాకాంక్షలు ...అంటూ ఇంస్టాగ్రామ్ లో మాధవన్ పోస్ట్ చేసారు. సరిత కూడా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. గతంలో ఇద్దరు కలిసి దిగిన ఫోటోను, ఇప్పటి ఫోటోను పోలుస్తూ పోస్ట్ పెట్టింది. 23ఏళ్లపాటు కలిసున్నాం. కాలం ఎంత త్వరగా పరిగెడుతుంది. ఐ లవ్ యూ.. పెళ్లి రోజు శుభాకాంక్షలు .. అంటూ కామెంట్ చేసింది.
8సంవత్సరాల సుదీర్ఘ డేటింగ్ తర్వాత మాధవన్, సరిత 1999 జూన్ 7వ తేదీన వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు వేదాంత్.