టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నటసింహ నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. ఈ కాంబినేషన్ లో రానున్న సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఇప్పుడు మీడియా ఇంటరాక్షన్‌లో డైరెక్టర్ అనిల్ ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలని వెల్లడించాడు. బాలయ్య గారితో నా సినిమా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. ఇది కథానాయకుడి క్యారెక్టరైజేషన్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో బాలయ్య మునుపెన్నడూ లేని విధంగా కనిపిస్తారు అని అనిల్ అన్నారు. బాలకృష్ణతో తన తదుపరి ప్రాజెక్ట్ షూటింగ్ ఈ అక్టోబర్‌లో ప్రారంభమవుతుందని కూడా అనిల్ తెలిపారు. ప్రస్తుతం బాలకృష్,ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'NBK107' సినిమాతో బిజీగా ఉన్నారు.