టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాలార్ మరియు ప్రాజెక్ట్ కె షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ స్టార్ హీరో మరికొన్ని సినిమాలు చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ పాన్ ఇండియా స్టార్ తన బాలీవుడ్ డెబ్యూ మూవీని సిద్ధార్థ్ ఆనంద్‌తో చేస్తున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. ఇప్పుడు, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మచనుంది అని సమాచారం. హిందీ, తెలుగులో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ మరియు సిద్ధార్థ్ ఇద్దరూ చేస్తున్న సినిమాలని పూర్తి చేసిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది అని లేటెస్ట్ టాక్. యాక్షన్ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.