భారతదేశంలోని ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లలో ZEE5 ఒకటి. ఈ పాపులర్ OTT ప్లాట్ఫారం తాజాగా ఇప్పుడు ఇంటెన్స్ థ్రిల్లర్ అయిన 'రెక్కీ' అనే మరో సిరీస్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. పోలూరు కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ అఫీషియల్ ట్రైలర్ ను మూవీ మేకర్స్ విడుదల చేసారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ వెబ్ సిరీస్జూన్ 17 నుండి ప్రసారం కానుంది. ఈ చిత్రంలో శ్రీరామ్, శివబాలాజీ, ధన్య బాలకృష్ణ, ఆడుకలం నరేన్, ఈస్టర్ నొరోన్హా జీవా, శరణ్య ప్రదీప్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీరామ్ మద్దూరి ఈ సిరీస్ కి సంగీతం అందిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీరామ్ కొలిశెట్టి ఈ సిరీస్ ని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa