బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు మరియు నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ గణేష్ టాలీవుడ్ లోకి హీరోగా అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'స్వాతి ముత్యం' తో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్సె ని మూవీ మేకర్స్ సంక్రాంతికి విడుదల చేయగా ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా మూవీ మేకర్స్ 'స్వాతి ముత్యం' సినిమా ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది అని ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.