ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెట్ ఫ్లిక్స్ లో కొనసాగుతున్న “RRR” హవా !

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 16, 2022, 11:11 AM

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో వచ్చిన లేటెస్ట్ మాసివ్ మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం”. దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా థియేటర్స్ లో నెలకొల్పిన సంచలనానికి మించి ఓటిటి లో వచ్చాక ప్రపంచ వ్యాప్తంగా నిలుపుతుంది.అనేకమంది హాలీవుడ్ ప్రముఖుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ ని అందుకుంటున్న ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ అయితే ఇంకా హవా కొనసాగిస్తూనే ఉంది. గత రెండు వారాలలో 40 లక్షలకి పైగా స్ట్రీమింగ్ హావర్స్ తో నాన్ ఇంగ్లీష్ సినిమాల లిస్ట్ లో ప్రపంచ వ్యాప్తంగా నెంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ లో నిలిచిన ఈ చిత్రం ఇప్పటికీ అదే నెంబర్ 1 స్థానంలో ఏకంగా 52 లక్షల 30 వేలకి పైగా గంటలు స్ట్రీమింగ్స్ తో భారీ రికార్డు నెలకొల్పింది. మొత్తానికి అయితే ఈ సినిమా హవా ఇలా ఉంది.


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa