నాచురల్ స్టార్ నాని, మలయాళ బ్యూటీ నజ్రియా నాజిమ్ జంటగా నటించిన చిత్రం అంటే సుందరానికి. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యార్నేని, రవి శంకర్ నిర్మించారు. ఈ చిత్రం జూన్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
తాజాగా ఈ మూవీ నుండి ఎంత చిత్రం... ఎన్నేసి జ్ఞాపకాలో... సాంగ్ కు సంబంధించిన ఫుల్ వీడియోను చిత్రబృందం యూట్యూబులో రిలీజ్ చేసారు. ఈ పాటలో నాని, నజ్రియా లిద్దరూ కలిసి ఏదో టూర్ మీద వేరే ప్రాంతానికి రాత్రి పూట బస్సులో ప్రయాణిస్తారు. వారి పరిచయం ప్రేమగా మారుతున్న సందర్భంలో వచ్చే పాట ఇది. ఈ పాట బస్ జర్నీ లో సాగే అందమైన రొమాంటిక్ గీతంగా ప్రేమికులను అలరిస్తుంది. వివేక్ సాగర్ స్వరకల్పనలో రూపొందిన ఈ మెలోడీ గీతానికి రామజోగయ్య శాస్త్రి గారు చక్కని సాహిత్యాన్ని అందించారు. స్టార్ సింగర్ అనురాగ్ కులకర్ణి తో కలిసి కీర్తన వైద్యనాధన్ ఎంతో అద్భుతంగా ఆలపించారు.