టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంతను ఆమె అభిమానులు ఫ్యాషనిస్టా అనీ, ఫ్యాషన్ ఐకాన్ అని పిలుచుకుంటారు. ట్రెండ్ ను ఫాలో అవుతూ, కొత్త ఫ్యాషన్ ప్రయోగాలకు తెర తీస్తూ సమంత వేసుకునే దుస్తులు ప్రతిసారి హాట్ టాపిక్ గా మారుతుంటాయి. తాజాగా సమంత సేవ్ సాయిల్ అనే పర్యావరణ హిత కార్యక్రమంలో పాల్గొంది. ఈ కార్యక్రమంలో భారతీయ యోగా గురు, ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ గారు, తెలంగాణా ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ గారు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సమంత పసుపు, నలుపు రంగు చారల చీరలో దేశీ బ్యూటీగా మెరిసిపోయింది. ఈ చీరలో సమంత సంప్రదాయబద్ధంగా కనిపిస్తూనే మోడెర్న్ గా కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన సమంత ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.