సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ నటించిన "పుష్ప" దేశవ్యాప్తంగా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పుష్ప మ్యానరిజమ్స్, హుక్ స్టెప్పులు, సాంగ్స్...అన్ని జనాలకు వైరస్ లా పట్టి వదలకుండా పీడిస్తున్నాయి. ఇప్పటికి సోషల్ మీడియాలో పుష్ప రీల్స్ కనిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమా బన్నీకి పాన్ ఇండియా ఇమేజ్ ను గ్రాండ్ గా తీసుకొచ్చింది. దీంతో వెంటనే పుష్ప 2 పనులను స్టార్ట్ చేసేసిన బన్నీ ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నారు. పుష్ప 2 ప్రీ ప్రొడక్షన్ పనులను చక్కబెట్టడంలో సుకుమార్ బిజీగా ఉన్నారు. జూలై నుండి ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్తుందని చిత్రసీమలో వార్తలు వినబడుతున్నాయి.
ఈ విషయం పక్కన పెడితే, బన్నీ నెక్స్ట్ ప్రాజెక్టు పై అంతటా ఆసక్తి నెలకొంది. ఈ మేరకు ఒక షాకింగ్ న్యూస్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే, పుష్ప 2 తదుపరి బన్నీ కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో ఒక సినిమా చేయనున్నారని టాక్. ఈ వార్తకు బన్నీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. పుష్ప లాంటి పాన్ ఇండియా మాస్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న బన్నీకి ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ లను తెరకెక్కించే లోకేష్ తోడైతే ఇండియన్ సిల్వర్ స్క్రీన్ క్లీన్ స్వీప్ అవడం ఖాయమని ఇప్పటినుంచే బన్నీ అభిమానులు కాలరెగరేసుకుని తిరుగుతున్నారు. ఐతే, ఈ ప్రాజెక్ట్ పై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.