యువహీరో కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా నటించిన చిత్రం "సమ్మతమే". కొత్త దర్శకుడు గోపినాధ్ రెడ్డి డైరెక్షన్లో యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ను కొంచెం సేపటి క్రితమే తెలంగాణా మంత్రి కేటీఆర్ రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ లో కిరణ్ యజూజువల్ తన సహజ నటనతో అదరగొట్టేసాడు. ఇక, చాందిని ట్రెడిషనల్ గా, నేటి తరం మోడెర్న్ అమ్మాయిగా రెండు పార్శ్వాలున్న పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. అమ్మ లేని జీవితంలో ఒక అమ్మాయిని పొందడమే లక్ష్యంగా పెట్టుకున్న ఒక సాధారణ యువకుడి కధే ఈ సినిమా. ట్రైలర్ లోనే సినిమాలోని అన్ని ఎమోషన్స్ ను చూపించి ఆసక్తిని పెంచేశారు. ఇక, ఫుల్ మూవీలో డైరెక్షన్, స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందా అన్నది ప్రశ్న? అది కూడా వర్కౌట్ ఐతే ఈసారి కిరణ్ తన గోల్ ను గట్టిగా కొట్టినట్టే.
ఈ సినిమాను యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ్ నిర్మించగా, శేఖర్ చంద్ర సంగీతమందించారు. ఈ మూవీ జూన్ 24 న ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతుంది.