టాలీవుడ్ మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరస సినిమాల షూటింగ్ లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉన్నాడు. శరత్ మండవ డైరెక్షన్లో రవితేజ హీరోగా నటిస్తున్న "రామారావు ఆన్ డ్యూటీ" షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధంగా ఉండగా, త్రినాధరావు నక్కిన డైరెక్షన్లో రవితేజ చేస్తున్న "ధమాకా" మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ రెండు సినిమాలు సెట్స్ పై ఉండగానే రవితేజ మరో కొత్త సినిమాను ఎనౌన్స్ చేసి, ఆ మూవీ షూటింగ్ ను కూడా ఆఘమేఘాల మీద కానిచ్చేస్తున్నాడు. వంశీ డైరెక్షన్లో రవితేజ నటించనున్న ఈ చిత్రం టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా, అదే టైటిల్ తో రూపొందనుంది. 1970లలో దేశవ్యాప్తంగా పేరుమోసిన స్టూవర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమాతో కెరీర్లోనే తొలిసారిగా బాలీవుడ్ ను పలకరించబోతున్నాడు రవితేజ. రాత్రనకా పగలనకా ఎడతెరిపి లేకుండా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించి ఒక హాట్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. అదేంటంటే, టైగర్ నాగేశ్వరావు మూవీ షూటింగ్ లో రవితేజ గాయాల పాలయ్యాడని, హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడని, గాయాలకు పది కుట్లు కూడా పడ్డాయని అంటున్నారు. యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ఒక భారీ యాక్షన్ సీన్లో పొరపాటున రోప్ జారి రవితేజ కు గాయాలయ్యాయట. ఐతే, గాయాలను కూడా లెక్క చెయ్యకుండా రవితేజ షూటింగ్ లో పాల్గొంటున్నారని, ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగానే ఉందని తెలుస్తుంది. కానీ ఈ విషయమై టైగర్ నాగేశ్వరరావు చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన చెయ్యలేదు.