బాలీవుడ్ భామ వాణి కపూర్ చేసినవి తక్కువ సినిమాలే.. కానీ ఫాలోవర్స్ ని బాగానే పెంచుకుంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫోటోలు, వీడియోలు అభిమానుల కోసం షేర్ చేయడం.. ఈ ముద్దుగుమ్మకు అలవాటు. తాజాగా వైట్ గౌనులో అదిరిపోయే షో చేసింది. ఫ్రంట్ & సైడ్ లుక్ లో ఫ్లాష్ తనపై పడేటట్టు పోజులు కొట్టింది. ఎప్పటిలాగే ఎద అందాలు ఆరబోసింది. 'శుద్దీ దేశీ రొమాన్స్'తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది వాణీ కపూర్. ఆ తర్వాత ఆహా కళ్యాణం (తమిళ్), బేఫికే, వార్, బెల్ బాటమ్, చండీగఢ్ కరే ఆషికి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం వాణీ కపూర్ 'షంషేరా'లో నటిస్తున్నది. షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.