తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన తమిళ బ్యూటీ ప్రియాంక మోహన్. నాని 'గ్యాంగ్ లీడర్' తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత 'శ్రీకారం'లో శర్వానంద్ కు జంటగా నటించింది. శివ కారీకేయన్ కు జంటగా ఆమె నటించిన 'డాక్టర్' బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. వీరి కాంబోలో ప్రస్తుతం 'డాన్' అనే సినిమా తెరకెక్కుతోంది. సినిమాల్లోనే కాదు. బయట కూడా పెద్దగా గ్లామర్ షో చేయదు ప్రియాంక. అయితే నిండైన దుస్తుల్లో అందరి చూపులు తనవైపు, తిప్పుకునే అందం ఆమె సొంతం. ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ పోజులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Latest pics of Beautiful #PriyankaMohan @priyankaamohan pic.twitter.com/pkdWD9QVqn
— Vamsi Kaka (@vamsikaka) June 16, 2022