ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ దంపతులకు 2022 జనవరిలో కుమార్తె పుట్టిన విషయం తెలిసిందే. ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా భర్త, కుమార్తెతో ఉన్న ఫొటోను ప్రియాంక చోప్రా షేర్ చేసింది. ఆ చిన్నారికి మాల్తీ మేరీ చోప్రా జోనాస్ అని పేరు పెట్టారు. ఆరు నెలల కుమార్తెతో తొలి 'ఫాదర్స్ డే'ను ఈ దంపతులు జరుపుకున్నారు. అయితే తండ్రి, కుమార్తె ధరించిన స్నీకర్స్ నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.