'సర్కారువారిపాట' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక సినిమా (SSMB 28) చెయ్యబోతున్నారన్న విషయం తెలిసిందే కదా. అధికారికంగా ప్రకటన జరిగినప్పటి నుండి ఈ సినిమాపై పలువార్తలు చిత్రసీమలో జోరుగా ప్రచారం చెయ్యబడుతున్నాయి. అతడు, ఖలేజా సినిమాల తర్వాత దాదాపు పదకొండేళ్ల కు మళ్ళీ మహేష్ - త్రివిక్రమ్ కాంబో పట్టాలెక్కడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ కాగా, తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.
తాజాగా ఈ సినిమాపై మరొక ఇంటరెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే... కథ పరంగా ఇదొక పీరియాడికల్ డ్రామా అని, ఐతే, మొత్తం సినిమా అలానే ఉండదని, ప్రస్తుతం, ఫ్లాష్ బ్యాక్ రెండూ సైమల్టేనియస్ గా జరుగుతాయని తెలుస్తుంది. అంటే... ఈ మూవీలో మహేష్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టే కదా. ఈ మూవీ సెకండాఫ్ లో వచ్చే మహేష్ క్యారెక్టర్ మెయిన్ హై లైట్ గా ఉంటుందని టాక్. ఈ వార్తలపై ఎటువంటి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ, మహేష్ అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు. పోతే... ఈ మూవీ వచ్చే నెలలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa