టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న కొత్త చిత్రం "ది వారియర్". కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామి డైరెక్షన్లో పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ సరసన కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జూలై 14వ తేదీన థియేటర్లలో విడుదలవడానికి రెడీగా ఉంది.
విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రచార కార్యక్రమాలను ముమ్మరంగా చేస్తున్న మేకర్స్, సినిమా నుండి లిరికల్ సాంగ్స్ ను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా నిన్న విజిల్ అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేస్తూ, ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామ్ మాట్లాడుతూ... నటీనటులకు, సాంకేతిక బృందానికి కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ క్రమంలో రామ్ తన దర్శకుడి గురించి మాట్లాడడం మర్చిపోయారు. ఇది గుర్తించిన రామ్ సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ లింగుస్వామికి సారి చెప్పారు. ఈ సినిమా మొదలైనప్పటి నుండి తన భుజాలపై మోస్తున్న వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ లింగుసామి గారికి కృతజ్ఞతలు తెలియచేసారు. ఇప్పటివరకు పని చేసిన ఉత్తమ దర్శకులలో లింగుసామి ఒకరని ట్వీట్ లో పేర్కొన్నారు.