ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ ను తప్పించేసి విజయ్ ను లైన్లో పెట్టిన బుట్టబొమ్మ!

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 25, 2022, 04:24 PM

ఆల్రెడీ కమిటైన ప్రాజెక్టులు, పొలిటికల్ కమిట్మెంట్స్ వల్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించాల్సిన భవదీయుడు భగత్ సింగ్ సినిమా ఆలస్యం అవుతుందన్న విషయం అందరికి తెలిసిందే. డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో అధికారికంగా ప్రకటించబడిన ఈ చిత్రం అప్పటి నుండి సైలెంట్ గా ఉంది. పవన్ రాక కోసం హరీష్ పడిగాపులు కాస్తున్నాడు. ఈ విషయం పక్కన పెడితే, ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డే నటిస్తుందని మేకర్స్ గతంలోనే ప్రకటించారు కానీ ఆమెకు ఎలాంటి అడ్వాన్స్ ఇవ్వలేదంట. ఈ సినిమాపై నెలకొన్న సందిగ్ధతతో ఆగస్టునెల డేట్స్ ను ఈ సినిమా కోసం కేటాయించిన పూజా ఇప్పుడా డేట్స్ ను మరో సినిమా కోసం ఉపయోగించబోతున్నట్టు తెలుస్తుంది. త్రివిక్రమ్ - మహేష్ కాంబోలో వచ్చే నెల నుండి సెట్స్ పైకి వెళ్ళబోతున్న సినిమా కోసం కానీ, పూరి జగన్నాధ్ - విజయ్ దేవరకొండ కాంబోలో రాబోతున్న రెండో సినిమా "JGM" కోసం కానీ ఈ డేట్స్ ను వాడాలని పూజా ఆలోచిస్తుందట. పవన్ తో బుట్టబొమ్మ జతకడితే చూడాలనుకునే ప్రేక్షకులు ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa