పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో "ఆదిపురుష్" అనే మైథలాజికల్ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే.
భారతీయ ఇతిహాసం "రామాయణం" ఆధారంగా రూపొందిన ఈ మూవీలో రామునిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటించారు. ఈ మూవీ షూటింగ్ గతేడాదిలోనే పూర్తవ్వగా, పోస్ట్ ప్రొడక్షన్ పనుల నిమిత్తం ఏకంగా ఏడాదికి పైగా సమయాన్ని తీసుకుంటుంది. ఈ ఏడాది ఆగస్టు 11 న విడుదలవ్వాల్సిన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈ సినిమా వాయిదా పడిందని ముంబై మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
3డి గ్రాఫిక్స్ లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa