ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూర్య దంపతులకు సాయి పల్లవి కృతఙ్ఞతలు

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 25, 2022, 04:27 PM

విరాటపర్వం సినిమాతో ఇటీవలే తెలుగు ప్రేక్షకులను పలకరించిన సాయి పల్లవి, మరో ఫిమేల్ సెంట్రిక్ మూవీలో నటిస్తుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో రూపొందుతున్న ఈ మూవీకి గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించారు. బ్లాక్ జీని అండ్ మై లెఫ్ట్ ఫుట్ ప్రొడక్షన్ బ్యానర్లపై రవిచంద్రన్ రామచంద్రన్, ఐశ్వర్య, థామస్ జార్జ్, గౌతమ్ రామచంద్రన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోవింద్ వసంత్ సంగీతం అందించారు.
2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో గార్గి సినిమాను తమిళంలో సమర్పించేందుకు స్టార్ పెయిర్ సూర్య, జ్యోతిక ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా సూర్య ప్రేక్షకులకు తెలియచేసారు. కొన్ని పాత్రలు మన మైండ్ లో తిష్ట వేసుకుని కూర్చుంటాయి. కొత్త ఆలోచనలు, క్రియేటివ్ రైటింగ్ కు మంచి గుర్తింపు తప్పక లభించాలి. గార్గి మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నా... అని ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ కు సాయి పల్లవి రిప్లై ఇస్తూ ... సూర్య, జ్యోతికలకు కృతజ్ఞతలు తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa