ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్తికేయ ట్రైలర్ పై అక్కినేని హీరో ప్రశంసలు

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 25, 2022, 04:28 PM

చందు మొండేటి డైరెక్షన్లో హీరో నిఖిల్ సిద్దార్ధ్ నటించిన చిత్రం "కార్తికేయ 2". గతంలో ఇదే కాంబోలో వచ్చిన కార్తికేయ కు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ కాగా, బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్, శ్రీనివాస్, వైవా హర్ష, ఆదిత్య మీనన్ కీలకపాత్రలు పోషించారు.
ఈ మూవీ మొదటి ట్రైలర్ నిన్న రిలీజై, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుంది. తాజాగా ఈ ట్రైలర్ పై హీరో నాగచైతన్య కూడా తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. వాహ్! ఎంతటి పవర్ఫుల్ ట్రైలర్... చందు - నిఖిల్ లాంటి సక్సెస్ఫుల్ కాంబోలో రాబోతున్న రెండో సినిమా కార్తికేయ వెండితెరపై ఎలాంటి అద్భుతాన్ని చెయ్యనుందో చూడాలి... అని ట్వీట్ చేసారు. ఈ సందర్భంగా కార్తికేయ టీమ్ మొత్తానికి చైతు శుభాకాంక్షలను తెలియచేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa