యాక్షన్ హీరో గోపీచంద్, రాశిఖన్నా జంటగా, మారుతి డైరెక్షన్లో రూపొందిన చిత్రం "పక్కా కమర్షియల్". జూలై 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడలో ఏర్పాటు చేసిన లైవ్ ఇంటిరాక్షన్ సెషన్ లో పక్కా కమర్షియల్ టీం పాల్గొంది. విజయవాడ రాజ్ యువరాజ్ థియేటర్లో ఈ రోజు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమానికి హీరో గోపీచంద్, డైరెక్టర్ మారుతి, కమెడియన్ ప్రవీణ్ తదితరులు పాల్గొని ప్రేక్షకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా అభిమానులు గోపీచంద్ ను గజమాలతో సత్కరించారు.
గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జెక్స్ బిజోయ్ సంగీతం అందించారు. సత్యరాజ్, శ్రీనివాస్, రావు రమేష్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa