మారుతి డైరెక్షన్లో హీరో గోపీచంద్, రాశిఖన్నా జంటగా నటించిన "పక్కా కమర్షియల్" మూవీకి సంబంధించి ఆదివారం సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలను తెలియచేసారు. ఆయన ప్రసంగిస్తూ .... కలిసి పని చెయ్యకపోయినప్పటికీ, ఇప్పటివరకు ప్రపంచానికి తెలియని, గోపీచంద్ తండ్రి టి. కృష్ణ గారితో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు.
ఒంగోలు CSR శర్మ కాలేజీలో చిరు ఫస్ట్ ఇంటర్మీడియట్ జాయిన్ అయినప్పుడు టి. కృష్ణ అదే కాలేజీలో ఫైనల్ ఇయర్ డిగ్రీ చదువుతున్నారట. ఆ క్రమంలో స్టూడెంట్ ఫెడరేషన్ ఎలక్షన్స్ లో తనకు సపోర్ట్ చెయ్యమని ఆయన చిరును అడిగారట. ఆ తర్వాత ఇద్దరూ సినీ ఇండస్ట్రీకి రావటం, కృష్ణ డైరెక్టర్ గా మారడం, చిరు నటుడిగా స్టార్ ఇమేజ్ ను తెచ్చుకోవడం జరిగాయన్నమాట. ఈ సందర్భంగా, టి. కృష్ణ గారిని తలచుకుంటూ, పిన్న వయసులోనే మరణించడం బాధాకరమని ఎమోషనల్ అయ్యారు.
హీరో గోపీచంద్ గురించి మాట్లాడుతూ... కెరీర్ తొలినాళ్ళ నుండి గోపీచంద్ విభిన్న సబ్జెక్టులను ఎంచుకుంటూ వస్తున్నారని, ఆయన నటించిన సాహసం, ఒక్కడున్నాడు, చాణక్య సినిమాలు తనకు చాలా ఇష్టమని చిరు తెలిపారు. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన పక్కా కమర్షియల్ చిత్రం జూలై 1న విడుదలవబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa