కొంత కాలంగా హీరోయిన్ ప్రియాంక జవాల్కలర్, క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇటీవల తనతో పాటు ఓ వ్యక్తి ముఖం కనిపించకుండా ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అతడు వెంకటేశ్ అయ్యర్ అని వదంతులు వ్యాపించాయి. దీనిపై తాజాగా ప్రియాంక స్పందించింది. అతడు తమ అసిస్టెంట్ అని, బాయ్‌ఫ్రెండ్ అని రూమర్స్ వ్యాప్తి చేయడం వల్ల తన తల్లి విషయం ఏంటో అని అడుగుతోందని ఆమె పేర్కొంది.