మారుతీ డైరెక్షన్ లో టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాకి 'పక్కా కమర్షియల్' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. ఈ యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్ మూవీలో గోపీచంద్ సరసన బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా జోడిగా నటిస్తుంది. పక్కా కమర్షియల్ సినిమా జూలై 1న విడుదల కానుంది. తాజా సమాచారం ప్రకారం, బి గోపాల్ దర్శకత్వంలో గోపీచంద్ నటించిన 'ఆరడుగుల బుల్లెట్' సినిమా తమిళంలో విడుదలకు సిద్ధంగా ఉంది అని సమాచారం. ఈ చిత్రాన్ని తమిళంలోకి డబ్ చేసి, జూలై 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గోపీచంద్ ప్రస్తుతం పక్కా కమర్షియల్‌ని ప్రమోట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. UV క్రియేషన్స్ అండ్ GA2 పిక్చర్స్ ఈ సినిమాని నిర్మించింది. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం మరియు కర్మ్ చావ్లా సినిమాటోగ్రఫీ అందించారు.