కోలీవుడ్ రొమాంటిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్. మాధవన్, తొలిసారి మెగాఫోన్ పట్టి డైరెక్ట్ చేస్తున్న చిత్రం రాకెట్రి: ది నంబి ఎఫెక్ట్. రాకెట్ సైంటిస్ట్ నంబి నారాయణ్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో హీరో సూర్య, షారుఖ్ ఖాన్ లు ఫ్రీ ఆప్ కాస్ట్ తో నటించినట్టు ఇటీవలే మాధవన్ తెలిపారు.
తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో, నంబి నారాయణ్ గెటప్ లో ఉన్న మాధవన్ ను చూసి సూర్య ఒక్కసారిగా షాకవుతాడు. నెరిసిన జుట్టు, పొడుగాటి గడ్డంతో గుర్తుపట్టలేని విధంగా ఉన్న మాధవన్ ఈ మేకోవర్ కోసం దాదాపు పద్దెనిమిది గంటలపాటు కష్టపడ్డాడంట. మాధవన్ కష్టానికి, సినిమా పట్ల అతనికున్న ప్యాషన్ కు సూర్య చేతులెత్తి నమస్కరిస్తాడు. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు జూలై 1వ తేదీన విడుదలకాబోతుంది.